Showing posts with label poetry. Show all posts
Showing posts with label poetry. Show all posts

Tuesday, October 14, 2008

సిపాయి



అమ్మలకు .... సర్వం
నాన్నలకు చిరు గర్వం
అమ్మమ్మలకు ప్రయాణ బడలిక
మామయ్యలకు "వెయిట్" చెయ్యాలన్న అలక
                  ఇదండి....

ముసి ముసి నవ్వుల సిపాయి
మా బుడి బుడి నడకల పాపాయి

కళ్ళలో కాంతులూ
చేతుల్లో గిలకలూ
మాటల్లో మకరందాలూ
ఆటల్లో అర్ధరాగాలూ
                 ఇందుకండీ....

ముసి ముసి నవ్వుల సిపాయి
మా బుడి బుడి నడకల పాపాయి